టీఆర్‌ఎస్‌‌లో చేరిన కాంగ్రెస్ కీలక నేత

తెలంగాణ కోసం పోరాడిన టీఆర్‌ఎస్‌ కావాలో, తెలంగాణకు టీడీపీ-కాంగ్రెస్‌లు అధికారంలోకి రావాలో ప్రజలు తేల్చుకోవాలని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు నీచమైనదని మండిపడ్డారు. ముదిగొండ, బషీర్‌బాగ్‌ కాల్పులు జరిపినవారు ఒక్కటయ్యారని విమర్శించారు. కాంగ్రెస్‌ నిర్ణయాధికారం డిల్లీలో ఉంటే, టీడీపీ నిర్ణయాధికారం అమరావతిలో ఉందన్నారు. మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. సురేశ్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.