జగ్గారెడ్డి అరెస్టయిన మరుసటి రోజే..

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టయిన మరుసటి రోజే.. రేవంత్‌రెడ్డికి జూబ్లిహిల్స్‌ పోలీసులు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. జూబ్లిహిల్స్‌ హౌజింగ్‌ బోర్డులో అవకతవకలకు పాల్పడ్డారని, పదిహేను రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేశారు. ఎన్నికల్లో బిజీగా ఉన్నందున రాలేనంటూ రేవంత్‌రెడ్డి వారికి రిప్లై ఇచ్చారు. వరంగల్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి, కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ మీద కేసులు కక్ష సాధింపులో భాగమని కాంగ్రెస్‌ ఆరోపణ. కేసులతో భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్‌ భావిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.