టూత్ పేస్ట్ అనుకుని ఎలుకల మందుతో పళ్ళు తోముకున్న మహిళ..

women died over rat powder

ఎలుకల మందుతో పళ్ళు తోముకుని మహిళ మృతిచెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన మరియమ్మ పొరపాటున టూత్ పేస్ట్ అనుకుని ఎలుకల మందు బ్రెష్ పై వేసుకుని తోముకుంది. దీంతో కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరియమ్మ మృతిచెందింది. మరియమ్మకు భర్త దశరధ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా మరియమ్మ మతిస్థిమితం కోల్పోయినట్టు బంధువులు వెల్లడించారు.