ఈ రెండు అలవాట్లే మగవారికి ఆ ‘ శక్తి ‘ లేకుండా చేస్తున్నాయా?

చిన్న కుటుంబం.. చింతలు లేని కుటుంబం.. ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. పెళ్లైనా నవ దంపతులు పిల్లల కోసం ఎంతో ఆరాట పడుతుంటారు. మహిళలు గర్బం దరించాలంటే పురుషుడు కనీసం 40 మిలియన్ స్పెర్మ్స్ విడుదల చేయాల్సి ఉంటుందని ఆధ్యనాలు చెబుతున్నాయి. స్పెర్మ్ కౌంట్ 20 మిలియన్ల కన్నా అధికంగా ఉన్నప్పుడు దానిని నార్మల్ కౌంట్‌గానే పరిగణిస్తారు వైద్యులు. కానీ స్పెర్మ్ కౌంట్ విపరీతంగా తగ్గితే పిల్లలు పుట్టే ఆవకాశం ఉండకపోవచ్చు. అయితే ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గటానికి ప్రధాన కారణం లైఫ్‌స్టైల్ మారడమే అని సర్వేలు చెబుతున్నాయి.

చాలా మంది ఒత్తిడికి గురైయ్యమని, అలసటగా ఉందని మద్యం తాగడం, పొగత్రాగడం వంటివి చేస్తుంటున్నారు. మరికొంత మంది లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందంటే.. లేట్ నైట్‌లని, నైట్ షిప్ట్ డ్యూటీలని నిద్ర విషయంలో అజాగ్రత్తగా ఉంటుంనారట. దీని వల్ల ఆలస్యంగా పడుకోవడం ఆలస్యంగా నిద్రలేవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి లైఫ్‌స్టైల్ ఉన్న వారి జీవితంలో చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా ఈ రెండు అలవాట్లే మగవారికి చాలా నష్టాన్ని కల్గిస్తున్నాయట..

* మద్యం మరియు పొగత్రాగడం వలన మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొగాకు, గుట్కాల్లోని నికోటిన్ వీర్య కణాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.

* ఆలస్యంగా పడుకోవడం ఆలస్యంగా నిద్రలేవడం వలన శరీరంలో అనేక మార్పులు వస్తాయని.. దీని ప్రభావం వీర్య కణాలపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.