పెన్నులతో వినాయకుడిని తయారు చేసిన విద్యార్ధి

అనంతపురం జిల్లా పామిడి గ్రామంలో నాగచైతన్య అనే విద్యార్ధి పెన్నులతో వినూత్నంగా వినాయకుడిని తయారుచేశారు. ప్రతి ఏటా పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు విభిన్న రూపాల్లో బొజ్జ గణపయ్యను తయారుచేయడం చైతన్యకు అలవాటుగా మారింది. ఇందులో బాగంగా ఈ సంవత్సరం పెన్నులు, పేపర్లతో తయారుచేశారు.. 40 కేజీల పేపర్‌, 16వేల పెన్నులను ఉపయోగించాడు. మొత్తం 45వేల రూపాయలు ఖర్చు చేశారు.