భార్య, కూతురిని చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

తాగుడుకు బానిస అయి భార్య, కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన అహ్మదాబాద్‌‌లో చోటు చేసుకుంది. కునాల్ త్రివేది అనే వ్యక్తి బార్య కవిత, కుతూరు శ్రీన్,తల్లితో కలిసి అహ్మదాబాద్‌‌లోని కృష్ణా నగర్ ఏరియాలో నివాస్తున్నాడు. గత కొంతకాలం నుంచి తాగుడుకు బానిస అయ్యాడు. తర్వాత మానసిక పరిస్థితి కూడా చేడిపోవడంతో తనకు ఎవరో చేతబడి చేసారంటూ తరుచుగా భార్య, తల్లితో  గొడువ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్య, కూతురికి విషమిచ్చి త్రివెది కూడా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. భార్య, కూతురి మృతి చెందగా, తల్లి అపస్మారక స్థితిలోకి వేళ్ళిపోయింది. 24 గంటలు గడిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్రివేది ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అమ్మ.. నాకు చేతబడి చేశారని మీకు ఎన్ని సార్లు చెప్పిన పట్టిచుకోలేదు. అందరూ చూసిన వారే తప్ప ఏ ఒక్కరూ కూడా నన్ను పట్టిచుకోలేదు. అని నోట్ రాసి ఉంది. సూసైడ్ నోట్ స్వాదినం చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు