బ్యూటీ సెలూన్‌లో మాజీ కార్పొరేటర్‌ అరాచకం..

dmk leader

ఓ డీఎంకే నేత అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాజీ కార్పొరేటర్‌ అయిన సెల్వ కుమార్‌ ఓ మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తమిళనాడులోని పెరంబలూర్‌లో ఓ బ్యూటీ సెలూన్‌లో మహిళను కాలితో తన్నాడు.

ఈ ఘటన గత మే 25న జరిగింది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అక్కడున్న మహిళలు కార్పొరేటర్‌ను వారించినా అతగాడు వెనక్కు తగ్గలేదు. ఆమెను కాలుతో తన్నుతూనే ఉన్నాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. విషయం బయటకు రావడంతో.. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సెల్వ కుమార్‌ను అధిష్టానం తొలగించింది.