హెచ్చరిక.. భీకరమైన తుఫాన్ ముప్పు..

hurricane-florence

భీకరమైన తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో అమెరికాలోని, ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫ్లోరెన్స్ తుఫాన్ గంటకు 225 కి.మీ వేగంతో కరోలినా తీరప్రాంతానికి తుఫాన్ చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో అలర్ట్ చేసిన అధికారులు, నిత్యావసర వస్తువులు తీసుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీచేశారు. ప్రభుత్వ హెచ్చరికల నేపధ్యంలో జనం నిత్యావసర వస్తువులు కొనేందుకు షాపులవద్ద బారులుతీరారు. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు, ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. భయంకరమైన గాలుతోపాటు 60 సెంటిమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.