బిగ్ బ్రేకింగ్ : ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు

cm chandrababunaidu fire on obsent mla's in assembly

ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది ధర్మాబాద్ కోర్టు. బాబ్లీ సందర్శన సమయంలో నమోదైన కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఈ మేరకు ఆదేశించింది. బాబ్లీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు సంబంధించి నమోదైన కేసులో 16 మందిని ఈ నెల 21 లోపు కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

బాబ్లీని నిర్మిస్తే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందంటూ 2010లో టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు ఆందోళన చేశారు. బాబ్లీ నిర్మాణం ఆపివేయాలని తెలంగాణ సరిహద్దు దాటి టీడీపీ బృందం చంద్రబాబు నేతృత్వంలో అప్పట్లో మహారాష్ట్రకు వెళ్లింది. తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించగానే ధర్నా చేస్తున్న చంద్రబాబును మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుతో పాటు 40మంది ఎమ్మెల్యేలపై ధర్మాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి బాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది.