వైరల్ వీడియో: సూపర్ డాన్స్.. ఇది చూస్తే ‘వావ్’ అనక తప్పదు!

ఈ మధ్య కాలంలో జరిగే వేడుకల్లో డాన్స్‌కు ప్రాముఖ్యత విపరీతంగా పెరిగిపోతోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ చిందులేస్తూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. ఓ వేడుకలో ఈ అంకుల్ చేసిన డాన్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కంపోజ్ చేసిన ‘ప్రేమికుడు’ మూవీలో ‘ముక్కాలా ముక్కబుల’ సాంగ్‌కు అదిరిపోయేలా స్టెప్‌లు వేశాడు ఈ అంకుల్. ప్రభుదేవా సూపర్ డాన్స్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ డాన్స్‌ను చూసి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు.