తన భార్యతో పాటు మరో వ్యక్తిని కాల్చి చంపి.. తర్వాత అతను..

తుపాకీ కాల్పుల మోతతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. కాలిఫోర్నియాలోని బేకర్స్ ఫీల్డ్ లో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. కాల్పుల అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బేకర్స్ ఫీల్డ్ లోని ట్రక్కింగ్ కంపెనీ లో తన భార్యతో పాటు మరో వ్యక్తిని తుపాకితో కాల్చిచంపాడు. మరోవ్యక్తిని వెంబడించి మరికొద్ది దూరంలో కాల్చినట్లు తెలుస్తోంది. తన ఇంట్లో మరో ఇద్దరు కుటుంబ సభ్యులను కాల్చిన దుండగుడు, అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.