‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ: పండుగ అల్లుడిదే..

Sailaja-reddy-alludu-review

టైటిల్ : శైల‌జా రెడ్డి అల్లుడు
తారాగణం : నాగ‌చైత‌న్య‌, ర‌మ్యకృష్ణ‌, అను ఇమ్మాన్యూల్‌, మురళీ శర్మ, న‌రేష్‌, వెన్నెల కిశోర్‌
సంగీతం : గోపి సుంద‌ర్
దర్శకత్వం : మారుతి దాస‌రి
నిర్మాత : ఎస్ రాధ‌కృష్ణ‌, నాగ‌వంశీ ఎస్‌, పీడీవీ ప్ర‌సాద్

శైలజా రెడ్డి అల్లుడు టైటిల్ వినగానే వెండితెర ఎవర్ గ్రీన్ ఫార్ములా అత్తా అల్లుళ్ళ కథలు చాలా గుర్తుకు వస్తాయి. మరి ఈ పండుగకొచ్చిన అల్లుడు ఏలా ఉన్నాడో చూద్దాం..

కథ:
చైతన్య( నాగచైతన్య) తన చదువు పూర్తి చేసుకొని తన తండ్రి ( మురళీ శర్మ) కంపెనీ లో మానేజింగ్ డైరెక్టర్ గాపనిచేస్తుంటాడు. తన కాలనీలో కి వచ్చిన అను( అను ఇమ్మానియేల్) ని చూడగానే ఇష్టపడతాడు. తన తండ్రి కి ఉన్న అహం కారణంగా ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బందిపడుతుంటారు. తండ్రి కున్న ఇగో కారణంగా చెల్లిలు పెళ్ళి ఆగిపోతుంది. తను ప్రేమించిన అమ్మాయి ఇగోలో తండ్రితో పోటీ పడుతుంది. ఆ ఇగో నచ్చే ఆ అమ్మాయిని అంగీకరిస్తాడు తండ్రి. ఇగో కి పోయి వారి ఎంగేజ్ మెంట్ కూడా యాక్సిడెంటల్ గా చేస్తాడు తండ్రి. అదే అమ్మాయితో నెల లోపు పెళ్ళి చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. శైలజా రెడ్డి కి అహాం తారాస్థాయిలో ఉంటుంది. కొన్ని కారణాలతో అను తన తల్లితో మాట్లాడదు. మరి తల్లి కూతుళ్ల మద్య దూరం తగ్గించి తన ప్రేమను చైతన్య ఎలా గెలిపించుకున్నాడు అనేది మిగిలిన కథ..?

కథనం:
తన పేరును క్యారెక్టర్ కి పెట్టుకున్న చైతన్య తనను పోలిన పాత్రనే చాలా సునాయాసంగా చేసాడు. తన బాడీ లాంగ్వేజ్ ని కూడా మార్చుకొని ఒక పుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో సునాయాసంగా తన పాత్రను పండించాడు. ఒక అమ్మాయి చూడగానే ఇష్టపడిన చైతన్య తన ప్రేమను గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు చాలా ఫన్ గా ఉన్నాయి . ముఖ్యంగా అను గీసిన తన పెయింటింగ్ ని చూసి వెన్నెల కిషోర్ తో చేసిన కామెడీ బాగా నవ్వు తెప్పించింది. ఇక నిజార్ షపీ సినిమటోగ్రఫీ ఈ కథకు క్లాసీ లుక్ ని తెచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ఎంటర్ టైనర్ గా మారిన శైలజా రెడ్డి సెంకండాఫ్ కొచ్చేస రికి ఆ ఫన్ కి ఎమోషన్స్ ని యాడ్ అయ్యింది. చిన్న చిన్న ఇగోలతో మానవ సంబంధాల మద్య పెరుగుతున్న దూరం అనే కాన్సెప్ట్ ని తీసుకొని ఫన్ ని మిస్ అవ్వకుండా మారుతి బాగా హ్యాండిల్ చేసాడు. మాణిక్యం క్యారెక్టర్ లో పృధ్వీ , వెన్నెల కిషోర్ ల కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి. ప్రాణిక్ హీలింగ్ కాన్సెప్ట్ ని మారుతి తన మార్క్ కామెడీతో బాగా ఎలివేట్ చేసాడు. అను ఇమ్మానియేల్ క్యారెక్టర్ బాగుంది. గుండెల్లో చాలా ప్రేమ ఉన్నా అది బయటకు చెప్పకుండా చేస్తున్న తన ఇగోని దాటుకొని ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశం బాగుంది. అలాగే రమ్య కృష్ణ కాంబినేషన్ లో అను చాలా కాన్ఫిడెంట్ గా తన రోల్ ని ప్లే చేసింది. సెకండాఫ్ కి ఎక్కువ ఎట్రాక్షన్ రమ్య కృష్ణ అయ్యింది.

శైలజా రెడ్డి లోని పవర్ ని కూతరి మీద మమకారాన్ని చూపిస్తే సాగే ఈ పాత్రకు రమ్య ప్రాణం పోసింది. శైలజా రెడ్డి కుటుంబ ప్రేక్షకులకు ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. శైలజా రెడ్డి అల్లుడు టైటిల్ సాంగ్ బాగుంది. అహాం అనే గోడలు బద్దలు కొట్టే అల్లుడు గా చైతన్య రోల్ మహిళా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

చివరిగా:
పండుగ అల్లుడిదే