యువరాజ్ సింగ్ కొత్త బీఎండబ్ల్యూ బైక్‌ కొన్నాడోచ్

yuvi new bike

యువరాజ్ సింగ్ అనగానే టక్కున గుర్తుకొచ్చేది అతని దూకుడైన బ్యాటింగ్. యువీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్‌కి ఎంతలా చుక్కలు చూపించేవాడో అందరికి తెలిసిందే! ప్రస్తుతం భారత జట్టుకు దూరమైన యువీ.. తన కొత్త బైక్ పై న్యూ లుక్‌తో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రేసింగ్ బైక్స్‌‌కు వీరాభిమాని అయిన యువీ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన బీఎండబ్ల్యూ G310R మోడల్ బైక్‌‌‌ను తన సొంతం చేసుకున్నాడు.

మరీ యువీ సొంతం చేసుకున్న ఈ బైక్ ఖరీదు ఎంతో తెలుసా.. రూ. 2.99 లక్షలు. రేసింగ్ బైక్స్‌ అంటే అమితమైన ప్రేమ ఉన్న యువీని ఈ బైక్‌పై చూసిన అభిమానులు అదుర్స్ అంటూ పొగడత్తల వర్షం కురిపిస్తున్నారు.