నిర్మాత డబ్బులు ఎగ్గొట్టాడు.. కోర్టుకు ఎక్కిన టాప్ హీరో..

మొన్నటికి మొన్న తమిళ్ హీరో శింబు రూ.50లక్షలు అడ్వాన్స్ ‌తీసుకుని షూటింగ్‌కి రాకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆ చిత్ర నిర్మాత కోర్టుని ఆశ్రయించాడు. ఇప్పుడు మరో కేసు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్. నిర్మాత ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని హీరో అరవింద్ స్వామి కోర్టుకి ఎక్కారు. చదురంగవేట్టై-2 అనే సినిమాలో హీరోయిన్ త్రిషతో కలిసి నటించారు అరవింద్ స్వామి. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత మనోబాలా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

ముందుగా కుదుర్చుకున్న ఒప్పందంలో కొంత డబ్బు బాకీ రూ.1.79 కోట్లు చెల్లిచాల్సి ఉంది. ఎన్ని సార్లు అడిగినా దాటవేస్తున్నారు నిర్మాత మనోబాలా. వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లాల్సి వస్తుందన్నా ఏ మాత్రం స్పందించలేదు. దీంతో తమకు ఇవ్వాల్సిన మొత్తంతో పాటు 18 శాతం వడ్డీ కూడా చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు అరవింద్ స్వామి. ఈ విషయమై సెప్టెంబర్ 20 లోపు కోర్టుకు నిర్మాత వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు మనోబాలకు నోటీసులు జారీ చేసింది.