బిగ్‌బాస్.. ఇవేం గేమ్స్.. అమ్మాయిల్ని అబ్బాయిలు..

అన్ని రంగాల్లో అమ్మాయిలు అబ్బాయిలతో పోటీపడుతున్నారు. ఆకాశంలో సగం. అన్నిట్లో సగం సగం. కానీ అమ్మాయిలు సౌకుమారత్వానికి, లాలిత్యానికి మరో పేరు. మరి అలాంటి అమ్మాయిలకి రియాలిటీ షో పేరుతో పెట్టే కొన్ని గేమ్స్ చూస్తుంటే బాధగానూ, ఇబ్బందిగానూ అనిపిస్తోందని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరుచూరి పలుకులు కార్యక్రమంలో బిగ్‌బాస్ షో గురించి ప్రస్తావించారు. స్త్రీలు, పురుషులు జనాభాలో సగం, ఆకాశంలో సగం కానీ శరీర నిర్మాణంలో, శక్తి సామర్థ్యాల్లో మాత్రం సగం.. సగం కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ షోలో పోటీలు స్త్రీ, పురుషులిద్దరినీ కలిపి పరిగెట్టిస్తున్నారు. అలా పరిగెడుతూ కొంతమంది అమ్మాయిలు పడిపోయినప్పుడు చాలా బాధ కలిగింది.

గత వారం జరిగిన కార్లో 24 గంటలు గేమ్‌లో.. అమ్మాయిలని బలవంతంగా బయటకు నెట్టే ప్రయత్నం కూడా చాలా బాధ కలిగించింది అని ఆవేదన వ్యక్తం చేసారు. బలవంతులు, బలహీనులను నెట్టేసి గెలవడం క్రీడా ధర్మం కాదు. స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో.. అక్కడ దేవతలు కొలువై వుంటారు అనే విషయాన్ని బిగ్‌బాస్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అని ఆయన సూచించారు.