నాటి కాంగ్రెస్‌ కార్యకర్తల కష్టాన్ని ఒకే ఒక్క కుటుంబం వాడుకుంది

కాంగ్రెస్‌ పార్టీ విపక్ష పాత్రను పోషించడంలోనూ విఫలమైందన్నారు ప్రధాని మోడీ. పాత తరం కాంగ్రెస్‌ కార్యకర్తలు పడిన కష్టమంతా ఒకే ఒక్క కుటుంబం ఉపయోగించుకుందని విమర్శించారు. నాలుగేళ్ల బీజేపి పాలనలో దేశం ప్రగతిపథంలో పయనిస్తోందని, ఇదే విషయాన్ని యావత్‌ ప్రపంచం, ప్రముఖ సంస్థలు సైతం ఢంకా భజాయించి మరీ చెబుతున్నాయన్నారు.