70 ఇళ్లలో గ్యాస్ పేలుళ్లు..

అమెరికాలోని మస్సాచుసెట్స్ లో గ్యాస్ లీకై పెద్దయెత్తున పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మస్సాచుసెట్స్ లోని మెర్రిమాక్ వ్యాలీలోని అండోవర్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 70 ఇళ్లలో గ్యాస్ పేలుళ్లు సంభవించాయని అధికారులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 50 వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఇళ్లలో మంటలు, పొగ కమ్ముకోవడంతో అక్కడ యుద్దవాతావరణం నెలకొంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.