ప్రియురాలిపై అత్యాచారం.. ప్రియుడు ఆత్మహత్య

ప్రేమించిన యువతిని తన కళ్ల ఎదుటే అత్యాచారం చేశారని ఓ యువకుడు తన జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. చత్తీస్‌గఢ్ లో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

సాయి అనే యువకుడు తన లవర్‌తో కలిసి ఓ స్కూల్ దగ్గరలో ఉన్నాడు. సరాదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. చేతిలో చెయ్యి వేసుకుని చుట్టు పక్కల జనాలు వారిని గమనిస్తున్నారన్న విషయాన్ని మరచిపోయారు. ఒకరినొకరు మైమరిచిపోయి ఆనందంలో తేలియాడుతున్నారు. కానీ వీరి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఎంతో ఉల్లాసంగా గడుపుతున్న ఈ జంట దగ్గరకు సడన్‌గా ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఏకాంతంలో ఉన్న వీరిపై దాడి చేశారు. సాయిని తీవ్రంగా కొట్టి ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అతని ముందే ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటనతో సాయి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ విషయం ఊళ్లో తెలిస్తే పరువు పోతుందని భావించిన సాయి.. ఆ అఘాయిత్యం జరిగిన మరుసటి రోజే ఆత్మహత్య చేసుకున్నాడు.

తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మరణాన్ని తట్టుకులేని ఆ యువతి.. ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష పడాలని.. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల ముందు వివరించింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.