బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. వణికిస్తోన్న ఫ్లోరెన్స్ హరికెన్

hurricane-florence

అమెరికాలోని కరోలినా రాష్ట్రాన్ని ఫ్లోరెన్స్ హరికెన్ వణికిస్తోంది. ఉత్తర కరోలినాలో కురిసిన భారీ వర్షాలకు రికార్డు స్థాయిలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగపడ్డాయి. రోడ్లపైన భారీగా వరదనీరుచేరుకోవడంతో రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. కరోలినా కోస్తా ప్రాంతంలో హరికెన్ ప్రభావం అధికంగా ఉంది. చాలా ప్రాంతాల్లో 7నుంచి 10 అడుగుల నీరు చేరుకోవడంతో పరిస్థితి దయనీయంగా మారిందని అధికారులు తెలిపారు. చాలాప్రాంతాల్లో వాహనాలు, విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో చాలాప్రాంతాల్లో జనం చీకట్టోనే మగ్గుతున్నారు. భారీ వరద కారణంగా ఓ హోటల్ కూలిపోవడంతో అందులో ఉన్న ఏడుగురిని అధికారులు రక్షించారు. వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేసి, పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే హరికెన్ ప్రస్తుతం నిధానంగా కొనసాగుతుందని, ఇది మరింత ఉదృతమయ్యే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది.