చంద్రబాబును అరెస్టు చేస్తే తీవ్రపరిణామాలు ఉంటాయి

చంద్రబాబు నాయుడును అరెస్టు చేస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాధరెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రేణిగుంట విమనాశ్రయంలో వీడ్కోలు పలికాక మంత్రి మీడియాలో మాట్లాడారు.రెండు రాష్ట్రాల ప్రజలు భవిష్యత్తు కోసం పోరాటం చేస్తే అరెస్టు చేస్తారా అన్నారు.ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు తెలంగాణా ఎన్నికల సంధర్బంగా ఈ విధంగా అరెస్టు చేస్తామనడం ఇది కేంద్ర ప్రభుత్వ కుట్రే అన్నారు.ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు

8 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది బాబ్లీ అంశం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం కుట్రలో భాగమేనని ఆరోపించారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. చట్ట విరుద్దంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం చరిత్రలో లేదన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుపై ఎంతో కఠినంగా వ్యవహరించినా వెనక్కు తగ్గలేదన్నారు. మోడీ, జగన్ చంద్రబాబును ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. మోడీని విమర్శించే వారిపై కేంద్రం ఈడీ, పోలీస్ కేసులు బనాయిస్తుందన్నారు.