ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న అందరికీ నిరుద్యోగ భృతి.. : నారా లోకేష్‌

minister nara lokesh finalize co-alliance between tdp and congress

మేనిఫెస్టోలో పెట్టిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. అక్టోబరు 2 నుంచి ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ భృతిని అమలు చేయబోతున్నట్లు లోకేష్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న అందరికీ ఇస్తామన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను లోకేష్‌ తిప్పికొట్టారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి అభివృద్ధి చేస్తున్నారన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్‌ చేసినా ఒక్కరు కూడా రుజువు చేయలేదన్నారు లోకేష్.