ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తి దారుణ హత్య

ప్రేమించిన పెళ్లి చేసుకోవటమే అతను చేసిన నేరమైందా? కూతురు ప్రేమను నిరాకరించిన తండ్రి ఆమె భర్తను హత్య చేయించాడా? నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువకుడిపై జరిగిన హత్య ఇలాంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. జ్యోతి ఆస్పత్రి ముందు గుర్తు తెలియని వ్యక్తి కత్తులతో దాడి చేసి దారుణ హత్యకు పాల్పడ్డారు.

మిర్యాలగూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతీ రావు కూతురు అమృత వర్షిని, పెరుమాళ్ల ప్రణయ్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకున్నా.. ఏడాది కిందటే వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. గర్భిణిగా ఉన్న అమృతను జ్యోతి ఆస్పత్రిలో చెకప్ కోసం తీసుకొచ్చాడు ప్రణయ్. అదును చూసి దాడి చేసిన దుండగులు కత్తులతో దాడి చేసి అతన్ని హత్య చేశారు.

మిర్యాలగూడ నడిబొడ్డలో ఈ దారుణం చోటు చేసుకుంది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. చుట్టుపక్కల వాళ్లు తేరుకునేలోపే దాడికి పాల్పడిన దుండగుడు ఆక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. పక్కా సూపరీ బ్యాచ్ కు చెందిన వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. కూతురి ప్రేమ వివాహం నచ్చని మారుతీరావు ఈ హత్య చేయించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.