వృద్ధ దంపతులు ఆత్మహత్య.. దహన సంస్కారాలు చేయలేని స్థితిలో..

old couple

అదొక హృదయ విషాదకర సంఘటన కూలీ నాలీ చేసుకుని కూడా బెట్టిన సోమ్మునంతా ఆ వృద్ధ దంపతులు నెల నెల ఎంతో కొంత వడ్డీ వస్తుందన్న ఆశతో నమ్మకంగా వుండే ఒక వ్యక్తికి అప్పుగా ఇచ్చారు . సంవత్సరాలు గడుస్తున్నా వడ్డీ ఇవ్వకపోగా కనీసం అసలు సోమ్మునైన మాకు ఇవ్వండి అని ఆ ఆసామి కాళ్ళ వెళ్ళా పడి మొత్తుకున్నా సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో ఆ వృద్ద దంపతులు అతని ఇంటి ముందే పురుగుల మందు సేవించి తనువు చాలించారు .

ఈ విషాద ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికి మృతుల కుటుంబానికి నేటికీ న్యాయం జరగలేదు. దీనిపై ఆవేదన చెందిన బంధువులు ఎవరూ తోడులేకపోవడంతో మృతదేహాన్ని స్మశానవాటికలో పెట్టి మూడురోజులుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు . ఇది తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతుల ఆత్మ ఘోష.

తూర్పుగోదావరిజిల్లా అంబాజీపేట మండలంలో హృదయ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పొత్తూరి వెంకటరాజు , బంగారమ్మ దంపతులు కే.పెదపూడి గ్రామంలోని బొక్కా చిట్టిబాబు అనే వ్యక్తికి సుమారు రెండు లక్షల సొమ్మును అప్పుగా ఇచ్చారు. సంవత్సరాలు గడచినా కొద్దీ చిట్టిబాబు అప్పు తీర్చకపోగా వారిని నానా దుర్భాషలాడటంతో ఆ వృద్ధ దంపతులు అతని ఇంటి వద్ద పురుగుమందు సేవించి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందతూ మూడు రోజులు క్రితం దంపతులు ఇద్దరు మరణించారు .

వీరు చనిపోయిన తరవాత అయినా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందనుకుంటే పోలీసులు అధికారులు నిర్లక్ష్యంతో అది కాస్తా నీరుగారిపోయింది. నిందితుడు చిట్టిబాబు పై తాత్కాలికంగా కేసులు వేసి బాధితులుకు ఎటువంటి న్యాయం చేయకుండా చేతులు దులుపుకున్నారు. మృతుల కుటుంబానికి ముందు వెనుక ఎవ్వరు లేకపోవడంతో వారి కుమారుడు జయరాజు ఏమి చెయ్యాలో పాలుపోక తండ్రి మృతదేహాన్ని గత మూడురోజులుగా అమలాపురం స్మశాన వాటికలో పెట్టి కన్నిరుమున్నిరు అవుతున్నాడు. ఆర్ధికంగా జయరాజును ఆదుకునే వరకు మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖననం చెయ్యమని బంధువులు కన్నీటితో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు న్యాయం జరగకపోతే అవసరమైతే ఆందోళన చేపడతామని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి .