కేసీఆర్‌తో కలిసి కుట్రలు చేస్తున్న మోదీ- పెద్దిరెడ్డి

చంద్రబాబు ఎదుగుదలను చూసి ప్రధాని మోదీ ఓర్వలేకపోతున్నారని తెలంగాణ టీడీపీ సీనియర్‌నేత పెద్దిరెడ్డి అన్నారు. కేసీఆర్‌తో కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబ్లీ ప్రాజెక్టు అంశంపై పోరాటం చేసిన చంద్రబాబు తప్పుడు కేసులు ఎదుర్కొంటుంటే కేసీఆర్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మహాకూటమితో టీఆర్‌ఎస్‌ , బీజేపీలకు తగిన బుద్ధిచెబుతామన్నారు పెద్దిరెడ్డి.