బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు పోలీసుల నోటీసులు

రాజాసింగ్‌కు అబిడ్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 17న పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆగస్టు 15న అనుమతి లేకుండా తిరంగా ర్యాలీ చేపట్టారన్నది ఆయనపై అభియోగం. దీనిపై అప్పుడే కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా 17వ తేదీన వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. ఐతే.. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యేనంటున్నారు రాజాసింగ్. మజ్లిస్ ఒత్తిడితోనే తనపై కేసు పెట్టారంటున్నారు. ఇలాంటి వాటికి బెదిరేది లేదని.. కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు.