కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నిర్మాత బండ్ల గణేష్

సినీనిర్మాత బండ్ల గణేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. తనకు కాంగ్రెస్‌ అంటే ఇష్టమని.. అందుకే ఆ పార్టీలో చేరానని బండ్ల గణేశ్‌ తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధమని స్పష్టంచేశారు. త్యాగాలకు కాంగ్రెస్‌ పార్టీ మారుపేరని చెప్పారు.