ఐదేళ్ళుగా తల్లికూతుళ్ళపై స్వామిజీ అత్యాచారం

ఆధ్యాత్మిక ముసుగులో స్వామిజీల అరచకాలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా ఓ అత్యాచారం కేసులో స్వామిజీ ఆశు మహారాజ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన ఆశు మహారాజ్‌ అనే స్వామిజి ఓ ఆధ్యాత్మిక సంస్థను నిర్వహిస్తున్నాడు. కష్టాలు చెప్పుకునేందుకు అతని దగ్గరకు వచ్చిన ఓ మహిళను లోంగదిసుకొన్నాడు. స్వామిజీతో పాటు ఆయన కుమారుడు,స్నేహితులు కలిసి 5 ఏళ్ళ పాటు ఆమెపై అత్యాచారం చేశారు. అంతేకాదు ఆ మహిళ కూతురి పై కూడా అత్యాచారం తెగపడ్డారు దుర్మార్గులు. వాళ్ళ అకృత్యాలకు విసిగిపోయిన ఆ మహిళ హజ్‌ఖాస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్క ఆధారాలతో నిందుతులను అరెస్టు చేశారు.