అంతర్జాతీయ విమానంలో 20.. వాటిని చూసి అధికారులు షాక్

goair-offers-13-lakh-seats-sale-flight-tickets-starts-rs

అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తతో ఉంటారు. ప్రతి ప్రయాణీకుడిని నిలువెల్లా చెకింగ్‌ చేయడంతో పాటు వారు తీసుకెళ్లే లగేజీపై నిఘా కన్ను తెరిచే ఉంటుంది. మరి అలాంటి భద్రతా వలయాన్ని తప్పించుకుని జర్మనీకి చెందిన ఓ ప్రయాణీకుడు ఎంచక్కా ఓ 20 పాములు ఉన్న సంచిని చంకలో పెట్టుకుని దర్జాగా ప్లైట్ ఎక్కాడు. ఎవరికంటా పడకుండా ఎల్లలు దాటించేశాడు.

రష్యాలోని షెరెమెటివో విమానాశ్రయ సిబ్బందికి అతడి లగేజీపై అనుమానం వచ్చింది. సంచిలో ఏముందో చూపించమంటూ అడిగారు. సంచిలోనుంచి ఓ చిన్న పెట్టెను బయటకు తీశాడు. అందులో 20 పాములు ఉన్న విషయం చెప్పి వాటిని చూపించాడు. వాటిని చూసిన భద్రతా సిబ్బంది షాకయ్యారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

పాముల కొనుగోలుకు సంబంధించి అన్ని పత్రాలను జర్మనీలోని భద్రతా అధికారులకు చూపించానని, అవి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించడం వల్లే అధికారులు అనుమతి ఇచ్చారని అన్నాడు. అయితే, రష్యా విమానాల్లో పాములు, పెంపుడు జంతువులు తీసుకురావడం నిషేదం. దాంతో జర్మనీ ప్రయాణీకుడి నుంచి రష్యా భద్రతా సిబ్బంది పాములను స్వాధీనం చేసుకుని మాస్కోలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.