వరకట్న వేధింపుల కేసుల్లో పోలీసులకు పవర్స్‌..

Hyderabad twin bomb blast case

వరకట్న వేధింపుల కేసుల్లో మళ్లీ పోలీసులకు పవర్స్‌ వచ్చాయి.. సెక్షన్ 498ఏ కింద నమోదయ్యే వరకట్న కేసుల్లో వెంటనే అరెస్టులు జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సెక్షన్ కింద నమోదయ్యే కేసులను ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ పరిశీలించాలని 2017, జులై 27న తీర్పు ఇచ్చిన ధర్మాసనం.. తాజాగా దాన్ని సవరించింది. మార్పులు చేస్తూ మరోసారి తీర్పును వెల్లడించింది. సెక్షన్ 498ఏని దుర్వనియోగం చేస్తున్నారని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల డీజీపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.