హస్తినలో కాంగ్రెస్ నేతలు… డీఎస్‌ చేరికపై మంతనాలు

ఇవాళ రాహుల్‌తో టీకాంగ్రెస్ నేతలు సమావేశం కాబోతున్నారు. ఎన్నికల వ్యూహం, పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ సమావేశం కోసం 40 మందికిపైగా లీడర్లు.. హస్తిన చేరుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, జనారెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి సహా ఇతర ముఖ్యులంతా రాహుల్‌తో భేటీ అవుతున్నారు. కొత్తగా మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్‌ల నియామకానికి ఈ మీటింగ్‌లో గ్రీన్ సిగ్నల్ తెలిపే అవకాశం ఉందంటున్నారు. అటు, 4 పార్టీ కమిటీల ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా పొత్తులు కుదిరినందున.. ఏయే సీట్లు వదులుకోవాలి, టికెట్ల ఖరారుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారు.