వైఎస్ జ‌గ‌న్‌ పాత్రలో విజయ్ దేవరకొండ ?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా తెర‌కెక్కుతున్న యాత్ర సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోవైఎస్ జ‌గ‌న్‌ పాత్ర‌లో విజయ్ కనిపించనున్నట్లు సమాచారం. జ‌గ‌న్‌ పాత్ర‌లో సూర్య గానీ .. కార్తీ గాని నటించ‌నున్నాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం జ‌గ‌న్ పాత్ర కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం నోటా అనే రాజకీయ నేపథ్యం ఉన్న బైలింగ్యువ‌ల్ మూవీతో పాటు డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ నటిస్తున్నాడనే సమాచారంలో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.