వాళ్ళతో తన బాధను వెళ్లబోసుకున్న అమృత వర్షిణి

miryalaguda-honor-killing-victim-pranay-wife-emotional-words

మిర్యాలగూడలో సంచలనం కలిగించిన పరువు హత్య కేసులో మృతుడి భార్య అమృత వర్షిణి బాధ వర్ణనాతీతం. భర్తను దారుణంగా చంపిన తండ్రిని వురి తీయాలనేంతగా ఆమె తండ్రిపై కోపాన్ని పెంచుకుంది. ఆమెను పరామర్శించగడానికి వచ్చిన కొందరు రాజకీయనేతలతో అమృత వర్షిణి తన బాధను వెళ్లబోసుకుంది. ‘నా కళ్ల ముందే కొట్టి చంపేశారు అంకుల్‌.. ఆ పరిస్థితుల్లో ప్రణయ్ ని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. జీవితాంతం సంతోషంగా ఉందామనుకున్నాం… ప్లీజ్‌ అంకుల్‌ నేను ప్రణయ్‌ను చూస్తా. నన్ను నా భర్త వద్దకు తీసుకువెళ్లండి. అంకుల్‌ ప్లీజ్‌.. ప్రణయ్‌ని చూడకపోతే ఎట్లా.. ప్లీజ్‌ నన్ను వదిలిపెట్టండి. ప్రణయ్‌ను నాకు దక్కకుండా చేసిన వాళ్లని చంపేయండి అంకుల్‌’ అంటూ పరువు హత్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృత వర్షిణి ఆమెను చూడటానికి వచ్చిన నేతలకు చెప్పుకుని కంటతడి పెట్టింది. కాగా అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా అమ్మాయి తండ్రి, బాబాయ్ లు కలిసి ప్రణయ్‌ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది.