‘శైలజరెడ్డి అల్లుడు’ ఒక్కరోజు కలెక్షన్స్ చూస్తే..

sailajareddy-alludu-first-day-collections

నాగ‌చైత‌న్య హీరోగా మారుతి తెర‌కెక్కించిన ‘శైలజరెడ్డి అల్లుడు’ చిత్రం ఒక్కరోజులోనే మంచి వసూళ్లను రాబట్టింది. వినాయకచవితి సందర్బంగా విడుదలైన ఈ చిత్రం ఆ ఒక్కరోజే రూ.13 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో రూ.8 కోట్ల రూపాయలు షేర్ ఉన్నట్టు సినీ వర్గాల సమాచారం. అత్త, అల్లుడు మధ్యలో కూతురు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కథ పలువురు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పండగ సీజన్ పైగా వీకెండ్ కావడంతో సినిమాకు భారీ వసూళ్లు ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంగీతం : గోపి సుంద‌ర్, దర్శకత్వం : మారుతి దాస‌రి, నిర్మాత : ఎస్ రాధ‌కృష్ణ‌, నాగ‌వంశీ ఎస్‌, పీడీవీ ప్ర‌సాద్.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.