మేనిఫెస్టో రూపకల్పనపై టీఆర్‌ఎస్ పార్టీ కసరత్తు

అభ్యర్ధుల ప్రకటనలోనే కాకుండా.. మేనిఫెస్టో రూపకల్పనలోనూ ముందుండేందుకు టీఆర్‌ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇవాళ మ్యానిఫెస్టో రూప‌క‌ల్పన‌పై తొలిస‌మావేశం నిర్వహిస్తోంది. మ‌రో నాలుగు రోజుల్లో ముసాయిదా సీఎం కేసీఆర్ వ‌ద్దకు చేర‌్చబోతుంది. ఇంతకీ టీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఎలా ఉంటుంది? జనాకర్షక పథకాలు ఏమైనా ఉంటాయా? కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు ధీటుగా హామీలు ఇస్తారా? పాత వాటికే కొత్తగా ప్రకటిస్తారా లేక వార్ వ‌న్ సైడ్ చేసేలా ఆశ్చర్యక‌ర ప్రక‌ట‌న‌లు ఉంటాయా?

ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో పూర్తిగా ప్రజా ఆమోద యోగ్యంగా ఉండ‌టంతో పాటూ… ఆచ‌ర‌ణ సాధ్యమ‌య్యే రీతిలోనే ఉంటుంద‌ని గ‌తంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే పార్టీ అభ్యర్థుల‌ను ప్రక‌టించిన వెంట‌నే.. మ్యానెఫెస్టో రూప‌క‌ల్పన కోసం పార్టీ సెక్రెట‌రి జ‌న‌ర‌ల్ కేశ‌వ‌రావు ఆధ్వర్యంలో 12మంది స‌భ్యుల‌తో కూడిన క‌మిటిని నియ‌మించారు. 2014మ్యానిఫెస్టో తో పాటూ..ఈ నాలుగున్నర ఏళ్లుగా ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు… ఇంకా కొత్తగా చేర్చాల్సిన అంశాలపై క‌మిటి స‌భ్యులు ఇవ్వాళ తొలిసారి స‌మావేశం కాబోతున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌మిలు నిర్ణయించేది కేవ‌లం మ్యానిఫెస్టోనే కావ‌డంతో సుదీర్గంగా చ‌ర్చజ‌ర‌ప‌బోతున్నారు.

గ‌త ఎన్నిక‌ల కంటే ముందు ప్రక‌టించిన మ్యానిఫెస్టోను పూర్తిస్థాయిలో అమ‌లు చేశామ‌ని సీఎం కేసీఆర్ బ‌ల్లగుద్దిమ‌రి చెప్తుంటారు. అందులో ప్రధానంగా విద్యుత్ రంగంలో ఆటుపోట్లను ఎద‌ుర్కొని… ప్రజ‌ల‌కు నిరంత‌ర క‌రెంట్ ఇవ్వడంతో పాటూ…వ్యవ‌సాయ రంగానికి 24గంట‌ల ఉచిత క‌రెంట్ ఇస్తున్న రాష్ట్రంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారు. మ‌రోవైపు నీటిపారుద‌ల రంగంలో అభివృద్ది… విద్యారంగంలో కీల‌క సంస్కర‌ణ‌లు… ప్రజాసంక్షేమంలో కీల‌క‌ నిర్ణయాలు.. పెన్షన్ పెంపు లాంటి అంశాలకు ప్రజ‌ల‌నుంచి విశేష‌స్పంద‌న వ‌చ్చిన‌ట్లు సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మ‌రోవైపు దేశంలో ఏ రాష్ట్రం కూడ సంక్షేమ రంగానికి పెద్దపీఠ వెయ్యలేద‌ని.. పారిశ్రామిక రంగంలో సింగిల్ విండో ప‌థ‌కం… ఐటి రంగం మ‌రింత‌గా వ్యాప్తి, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి అంశాలు విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. దీంతో అన్నివ‌ర్గాల‌నుంచి టీఆర్ఎస్ పార్టీపై ఆద‌ర‌ణ పెరిగింది. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలనుంచి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సినవి కొన్ని గుర్తించి వాటిని మ్యానిఫెస్టోలో ప్రధాన ఎజెండాగా పెట్టడం … మ‌రోవైపు ప్రభుత్వం మీద కాస్త వ్యతిరేక‌త వ‌చ్చినా ద‌ళితుల‌కు మూడెక‌రాల పంపిణీ, ల‌క్ష ఉద్యోగాల భ‌ర్తి, అంశాల‌ను పూర్తిచేసే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు కార్యచ‌ర‌ణ ప్రక‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అంద‌రికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రక‌టించ‌గా..అందులో రెండు ల‌క్షల‌మేర రుణ‌మాఫి చ‌ర్చానీయాంశంగా మారింది. ఇప్పటివ‌ర‌కు వ‌ర‌కు తెలంగాణ‌లో మొద‌టి మ్యానిఫెస్టోలో ప్రక‌టించిన ల‌క్షవ‌ర‌కు రుణ‌మాఫి విడ‌త‌ల వారిగా చేస్తున్నారు. ఇలా కాకుండా కొత్త మ్యానిఫెస్టోలో ఏక‌కాలంలో మాఫి చేసే నిర్ణయాన్ని పొంద‌ప‌రిచేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగాల క‌ల్పన లో వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌ను పోగొట్టేందుకు …ఈ మ‌ద్యకాలంలోనే కొత్త జోన్ల వ్యవ‌స్థకు ఆమోద ముద్ర ప‌డ‌టంతో భారిగా ఉద్యోగాల అంశం మ్యానిఫెస్టోలో పెట్టాల‌ని ఒక జాబ్ క్యాలెండ‌ర్ ను త‌యారు చేసే విదంగా నియ‌మాకాలు ఉండే అంశాన్ని ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 2014మ్యానిఫెస్టో ఒక ఉద్యమ మ్యానిఫెస్టోగానే ప‌రిగ‌ణించినా…ప్రస్తుతం అభివృద్ది అంశాల‌ను ఎక్కువ‌గా ఉండేలాచూడాల‌ని…కోటిఎక‌రాల‌కు నీరు అందించేలా …హ‌రిత తెలంగాణ‌లా మార్చే విదంగా మ్యానిఫెస్టో రూపొందించాల‌నేది గులాబి అధినేత ల‌క్ష్యంలా క‌నిపిస్తోంది.