ఆ టికెట్‌ను కడియం శ్రీహరికి ఇవ్వాలని కార్యకర్తలు ధర్నా

fee reimbursement

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ పార్టీలో రోజు రోజుకూ అసమ్మతి పెరిగిపోతోంది. జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ టికెట్‌ను రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నగరంలోని సర్క్యూట్‌ గెస్ట్‌ హౌజ్‌ లో ధర్నా చేపట్టారు. కడియం శ్రీహరి ఎలాంటి కార్యక్రమాలకు హాజరుకాకుండా అడ్డుకున్నారు.

మహబూబాబాద్‌లో శంకర్‌ నాయక్‌.. ములుగులో చందూలాల్‌.. భూపాలపల్లిలో స్పీకర్‌ మధుసూదనాచారి.. జనగామలో ముత్తిరెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌ రావులకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి.