రూపాయి దెబ్బకు భారత దేశ ఫారెక్స్ నిల్వలు అడుగంటాయా?

విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు సెప్టెంబరు 7తో ముగిసిన వారానికి 819.5 మిలియన్‌ డాలర్లు తగ్గి 399.28 బి.డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఒక ఏడాదికిపైగా కాలంలో 400 బి.డాలర్ల దిగువకు విదేశీ మారకపు నిల్వలు పడిపోవడం ఇదే తొలిసారని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగా ఇటీవల ఆర్‌బీఐ డాలర్లను విక్రయిస్తూ రావడంతో నిల్వలు తగ్గాయి. సెప్టెంబరు 7తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 887.4 మి.డాలర్లు తగ్గి 375.09 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. పసిడి నిల్వలు 71.9 మి.డాలర్లు పెరిగి 20.23 బి.డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF‌)  వద్ద SDRలు 1.5 మి.డాలర్లు తగ్గి 1.47 బి.డాలర్లకు, నిల్వలు 2.5 మి.డాలర్లు తగ్గి 2.47 బి.డాలర్లకు పరిమితమయ్యాయి.

 

-ADVT-