ఎన్ని కష్టాలు.. నష్టాలు ఉన్నా.. మూడు విజన్లతోనే ముందుకు సాగుతున్నా- బాబు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత.. రాష్ట్రంలో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా ఎక్కడా అధైర్యపడలేదని చంద్రబాబు గుర్తు చేశారు. కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా చేసుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలు.. నష్టాలు ఉన్నా.. మూడు విజన్లతో ముందకు సాగుతున్నాను అన్నారు. విజన్‌ 20 22, విజన్‌ 20 29, విజన్‌ 20 50లను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే ఏపీని అగ్రగామిగా చేయడమే తన ప్రభుత్వ లక్ష్యం అన్నారు చంద్రబాబు..

టెక్నాలజీని అత్యద్భుతంగా వాడుతున్న ప్రభత్వం మనదే అని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. టెక్నలజీ సహకారంతో ఎన్ని అద్భుతాలు చేపట్టామన్నారు. టెక్నాలజీ కారణంగానే ఇంకే రాష్ట్రానికి రాని విధంగా మానకు అవార్డులు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు..

దేశంలో ఐటీకి అత్యంత ప్రాధాన్యమిచ్చిన ముఖ్యమంత్రి తానే అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకప్పుడు పీసీ అంటే అంతా పోలీస్‌ కానిస్టేబుల్‌ అనుకునే వారని.. తాను ఐటీకి ప్రాధాన్యం ఇచ్చిన తరువాత పీసీ అంటే పర్సనల్‌ కంప్యూటర్ అని ఇప్పుడు అంటున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టుంది తన ప్రభుత్వమే అన్నారు చంద్రబాబు..

ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నీతివంతమైన పాలన అందిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. మనకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ సమర్థవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. ప్రజల సంతోష స్థాయి పెంచే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోంది అన్నారు చంద్రబాబు..

కేంద్రం సహకరించకపోయినా.. ప్రజల సహకారం టెక్నాలజీలతో పాలనలో ముందుకు దూసుకుపోతున్నాం అన్నారు చంద్రబాబు. పేదవాడికి ఎలాంటి సమస్య వచ్చినా తమ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది అని భరోసా ఇచ్చారు. రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా పాలన అందిస్తున్నాను అన్నారు చంద్రబాబు..