బ్యూటీ పార్లర్ వద్దే ప్రణయ్‌ని హత్య చేయాలని ప్లాన్ చేశారు కానీ…

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసులో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ కేసు దర్యాప్తు వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ నెల 14న ప్రణయ్ హత్య జరిగినా..గతంలోనూ రెండు సార్లు విఫలయత్నం జరిగిందన్నారు.ఆగస్టు 22న తొలిసారి హత్యాయత్నం జరిగింది. ప్రణయ్ ను అతని ఇంటి వద్దే హత్య చేసేందుకు విఫలయత్నం చేశారు. ఇక సెప్టెంబర్ లో అమృతను కిడ్నాప్ చేసి…ప్రణయ్ ని హత్య చేయాలని ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. అమృత బ్యూటీ పార్లర్ వెళ్లిన సమయంలో ప్రణయ్ తో గొడవ పెట్టుకొని హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నా..చివరి నిమిషంలో ప్లాన్ అమలు వాయిదా వేసుకున్నారు. ఈ నెల 14న మూడోసారి హత్య ప్లాన్ ను అమలు చేశారు.