విషాదం: సంగం బ్యారేజీలో ఐదుగురు యువకుల గల్లంతు..ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ దగ్గర గల్లంతైన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా కర్ణాటకలోని తముకురు, చిరకు ప్రాంతాలకు చెందినవారు. నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండగకు వెళ్తున్న యువకులు…ఈత కొట్టెందుకు సంగం బ్యారేజీ దగ్గర పెన్నా నదిలోకి దిగారు. నదిలో ఏర్పడిన సుడిగుండంలో ఏర్పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

గురువారం నుంచి ప్రారంభమయ్యే రొట్టెల పండగ కోసం వీళ్లంతా నెల్లూరు జిల్లాకు వెళ్తు ప్రమాదం బారిన పడ్డారు. స్థానిక మత్స్యకారులు ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.