నిరుద్యోగులకు తీపి కబురు.. 18,448 ఉద్యోగాల భర్తీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు తీపి కబురు అందించనున్నారు. బుధవారం జరిగే అసెంబ్లీలో 18,448 ఉద్యోగాల భర్తీపై శాసనసభలో ప్రకటన చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర శాఖల నియామక సంస్థలు విడివిడిగా ప్రకటనలు ఇవ్వనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
డీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే పోస్టులు..
పాఠశాల విద్యాశాఖ: 5000
పురపాలక పాఠశాలలు: 1100
గురుకుల పాఠశాలలు: 1100
సాంఘీక సంక్షేమ గురుకులాలు: 750
షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలలు: 500
నాన్‌షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలలు: 300
బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు: 350
ఏపీఆర్ఈఐ సొసైటీ:175
సమాచార పౌర సంబంధాల శాఖలో డీపీఆర్వో: 4, ఏపీఆర్వో: 12, డీఈటీఈ పోస్టులు 5 వరకు ఉన్నాయి.
ఉపాధ్యాయ పోస్టులు
పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా వెల్లడించిన 5వేల ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన వివరాలు
మొత్తం పోస్టులు : 5000
ఎస్జీటీలు: 2,290
స్కూల్ అసిస్టెంట్లు : 1,456
భాషా పండితులు: 251
వ్యాయామ ఉపాధ్యాయులు: 24
ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు: 929
న‌ృత్య ఉపాధ్యాయులు: 50
పురపాలక ఉపాధ్యాయుల పోస్టులు..
మొత్తం పోస్టులు: 1100
ఎస్జీటీలు: 882
స్కూల్ అసిస్టెంట్లు: 148
భాషా పండితులు: 60
వ్యాయామ ఉపాధ్యాయులు: 10
ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు అందిన వెంటనే ప్రకటనలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.