సల్మాన్‌ కంట కన్నీరు..

మనసున్న ప్రతి ఒక్కరినీ కొన్ని దృశ్యాలు, కొన్ని సంఘటనలు కన్నీరు పెట్టిస్తాయి. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తన సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకోవడంతో పాటు మనసున్న మానవతావాదిగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. పలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనవంతు చేయూతనందిస్తుంటాడు. మంగళవారం జైపూర్‌లోని దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ఓ సెంటర్‌ని ప్రారంభించాడు. వారిని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. వారితో కబుర్లు చెబుతూ, అడిగిన వాటికి సమాధానాలు చెప్పాడు. వారితో కలిసి ఆడి పాడాడు. సల్మాన్ వచ్చినందుకు పిల్లలంతా ఆయనతో ఎంతో సంతోషంగా గడిపారు. వారిని చూసిన సల్మాన్ కొంత ఉద్విగ్నతకు లోనయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

View this post on Instagram

 

Salman very emotional After meeting the blind and orphans #salmankhan #jaipur @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on