రంగారెడ్డి రైడర్స్‌కు షాకిచ్చిన మంచిర్యాల

KABADDI

తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఐదోరోజు గద్వాల్ గ్లాడియేటర్స్ , మంచిర్యాల టైగర్స్ విజయాలు నమోదు చేశాయి. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ బుల్స్ ,గద్వాల్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. అయితే సెకండాఫ్ చివర్లో అద్భుతంగా పుంజుకున్న గద్వాల్ 34-27 స్కోర్‌తో హైదరాబాద్‌ను నిలువరించింది. రెండో మ్యాచ్‌లో మంచిర్యాల జట్టు రంగారెడ్డి రైడర్స్‌కు షాకిచ్చింది. ఆసక్తికరంగా సాగిన పోరులో ఆ జట్టు 37-28 స్కోర్‌తో విజయం సాధించింది. లీగ్‌లో మంచిర్యాలకు ఇది రెండో విజయం.