బాబ్లీ కేసు.. ముందు అమెరికా వెళ్ళండి.. చంద్రబాబుని వారించిన..

cm chandrababunaidu fire on obsent mla's in assembly

బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో ధర్మాబాద్ కోర్టుకు తన తరపున న్యాయవాదిని పంపాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ముఖ్యమంత్రి తరపున హాజరై.. కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై రికాల్ పిటిషన్‌ వేయనున్నారు. న్యాయవ్యవస్థలపై గౌరవంతో ముందుగా కోర్టుకు హజరవాలని అనుకున్నా.. 22న ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించాల్సి ఉండటంతో తన తరపున న్యాయవాదులను పంపాలని సీఎం నిర్ణయించారు.

బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో 8 ఏళ్ల తరువాత ధర్మాబాద్ కోర్ట్ చంద్రబాబు నాయుడుతో సహా ఆయన వెంట ఉన్న 16మందికి కోర్ట్ కు హాజరు కావాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 21వ తేదిన ధర్మాబాద్ కోర్ట్ ముందు ఉండాలని నోటీసులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోర్ట్ కు వెళ్ళాలా వద్దా అనే దానిపై చంద్రబాబు న్యాయనిపుణులు, మంత్రులు, తెలంగాణ టీడీపీ నేతలతో గత నాలుగైదు రోజులుగా చర్చలు జరిపారు. చంద్రబాబు ముందు రకరకాల అభిప్రాయాలను వ్యక్త పరిచారు నేతలంతా. అయితే చంద్రబాబు నాయుడు ఈనెల 22న ఐక్యరాజ్య సమితిలో సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ధర్మాబాద్ కోర్ట్ కు వ్వక్తిగతంగా హజరుకాకుండా న్యాయవాదులను పంపాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

కోర్టు నోటీసులు జారీ అయిన తర్వాత…చంద్రబాబు కోర్టుకు హజరు అవుతారనే ప్రచారం జరిగింది. ఈనెల 21న చంద్రబాబు భారీ కాన్వాయ్ తో ధర్మాబాద్ కోర్ట్ కు హాజరవుతారనే టాక్ నడిచింది. న్యాయవ్యవస్థను గౌరవించాలి కాబట్టి చంద్రబాబు సైతం రెండు రోజుల క్రితం మంత్రులతో జరిగిన సమావేశంలో దాదాపు కోర్ట్ కు హాజరవ్వాలనే నిర్ణయానికే వచ్చారు. అయితే.. న్యాయనిపుణులు, మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రిని వారించినట్లు తెలుస్తోంది. సీఎంగా మీరు హాజరవడం కంటే తొలిసారిగా నోటీసులు వచ్చాయి కాబట్టి న్యాయవాదులను పంపడమే మంచిదని అభిప్రాయం చంద్రబాబు ముందు వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ నోటీసులు తమకు అందలేదనే రీజన్ ను అధికారులు సీఎం దృష్ఠికి తీసుకెళ్ళారు. తొలిసారే నోటీసులు వచ్చాయి కాబట్టి ముందుగా న్యాయవాదులును పంపాలని అమెరికా పర్యటన నుంచి వచ్చాక మళ్ళీ నోటీసులు ఏమైనా జారీ చేస్తే అప్పుడు ఆలోచిద్దామని చంద్రబాబును మంత్రులు వారించారు.

ఈ నోటీసుల వెనక బీజేపీ కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. 8ఏళ్ళుగా రాని నోటీసులు ఎన్డీఏ నుంచి బయటికి రాగానే నోటీలు జారీ అయ్యాయి కాబట్టి ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందనే సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తొలిసారి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం వచ్చినందున పార్టీ సీనియర్లు, మంత్రులు ముందు అమెరికా వెళ్ళిరావాల్సిందిగా చెప్పారు. వీరందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు కోర్ట్ కు న్యాయవాదిని పంపాలనే నిర్ణయం తీసుకున్నారు.