మూడు గంటల పాటు బాత్రూంలోనే ఎలుగుబంటి

కరీంనగర్ లో హల్చల్ చేసిన ఎలుగుబంటిని ఎట్టకేలకు బంధించారు అటవీశాఖ అధికారులు. బీఎస్ఎన్ఎల్ భవన్ లోకి దూరిన ఎలుగుబంటి మూడు గంటల తర్వాత అక్కడి బాత్రూంలో నుంచి ఒక్కసారిగా బయటకి వచ్చేందుకు ప్రయత్నించింది. అప్పటికే అదును కోసం ఎదురుచూస్తున్న అటవీశాఖ సిబ్బంది ఎలుగుకు గన్ తో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అక్కడి నుంచి తప్పించుకొని 20 ఫీట్ల చెట్టు ఎక్కిన ఎలుగుబంటి..ఇంజక్షన్ ప్రభావంతో మత్తులోకి జారుకుంది. చెట్టుపై నుంచి కింద పడింది. ఎలుగు నేల మీద పడకుండా వల సాయంతో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.