గిరిజన పుత్రికకు అమెరికా చదువుకు అవకాశం..

మట్టిలోని మాణిక్యాలు.. అడవిలోని ఆడబిడ్డలు. అవకాశమివ్వాలేకానీ మేమూ మీకేమాత్రం తీసిపోమంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల గురుకులానికి చెందిన భూక్య లావణ్యకు అమెరికాలో రెండేళ్ల పాటు చదువుకునే అవకాశం వచ్చింది. చదువులో అత్యంత ప్రతిభ కనబరిచే ముగ్గురు విద్యార్ధులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి అమెరికాలో చదువుకునే అవకాశం కల్పిస్తోంది.

ఇందులో భాగంగానే ఇద్దరు వనపర్తి జిల్లా కేంద్రం, రంగారెడ్డి జిల్లా బాలానగర్‌కు చెందిన విద్యార్థులు కాగా మరొకరు గురుకుల పాఠశాలలో చదువుతున్న భూక్య లావణ్య. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చెందిన భూక్య ఉపేందర్, నీలావతి దంపతుల పెద్ద కుమార్తె లావణ్యకు ఈ అవకాశం దక్కింది. నవంబర్ నెలలో లావణ్య అమెరికా వెళ్లే అవకాశం ఉంది.