మాధవి హెల్త్‌ బులిటెన్‌ విడుదల

madhavi health buliten released

తండ్రి దాడిలో గాయపడిన మాధవి పరిస్థితి విషమంగానే ఉంది. యశోదా ఆస్పత్రిలో ఉన్న ఆమెకు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కత్తితో నరకడం వల్ల తెగిపోయిన చెయ్యి, చెవిదగ్గర ఇప్పటికే శస్త్ర చికిత్స చేశారు..

ప్రస్తుతం ఆమె పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు యశోద వైద్యులు.. ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే ఉంది అన్నారు. మరో 48 గంటలు దాటితే గాని ఆమె పరిస్థితిపై అవగాహనకు రాలేమన్నారు. ఆమె అవయవాలు సక్రమంగా స్పందించేందుకు చికిత్స చేశామన్నారు.

అటు, ICUలో ఉన్న మాధవిని చూసి సందీప్ భోరుమంటున్నాడు. నిన్న మావయ్య మనోహరాచారి చేసిన దాడిలో సందీప్ కూడా గాయపడ్డాడు. అతను కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్ చేశారు. తమ పెళ్లిని వ్యతిరేకిస్తూ.. అమ్మాయి తండ్రి ఈ స్థాయిలో కక్ష పెంచుకుని తమపై దాడికి దిగడంతో షాక్‌లో ఉన్నాడు.