నటుడు మోహన్‌బాబు ఇంట విషాదం..

ప్రముఖ సినీ నటుడు, మంచు మోహన్‌బాబు ఇంట్లో విషాదం. ఆయన తల్లి మంచు లక్ష్మమ్మ (85) తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌లో ఈ రోజు ఉదయం ఆరుగంటలకు కన్ను ముశారు.

మోహన్ బాబు ఆయన కుటుంబసభ్యులతో అమెరికాలో ఉన్నారు. తల్లి మరణ వార్త విన్న మోహన్ బాబు హుటాహుటిన ఇండియాకు బయలుదేరారు. శుక్రవారం లక్ష్మమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.