పైలెట్‌ పొరపాటు.. ప్రయాణికుల ముక్కులు, చెవుల్లోంచీ రక్తం..

flight

ముంబై-జైపూర్‌ విమానంలో కలకలం రేగింది. సిబ్బంది పొరపాటు కారణంగా 30 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబై నుంచి జైపూర్‌కు 166 మంది ప్రయాణికులతో బయలుదేరిన జెట్ ఎయిర్ వేస్ విమానంలో క్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో తీవ్ర కలకలం చెలరేగింది. క్యాబిన్‌లో వాయు పీడనాన్ని స్థిరంగా ఉండే బటన్‌ను క్రూ నొక్కక పోడవంతో, దాదాపు 30 మంది ప్రయాణికుల ముక్కులు, చెవుల్లోంచీ రక్తం వచ్చింది. ఆక్సిజన్ తక్కువైపోయి అందరు ప్రయాణికులకూ తలపోటుతో తీవ్ర ఇబ్బంది పడ్డారు..

వెంటనే విషయాన్ని గమనించిన పైలెట్‌ క్యాబిన్‌లోని అక్సిజన్‌ మాస్కులు తెరుచుకునేలా చేశారు. తరువాత గ్రౌండ్ స్టాఫ్‌కు చెప్పిన పైలట్‌ విమానాన్ని న్యూ ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వైద్య బృందం ప్రయాణికులకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్ సమయంలో సిబ్బంది చేసిన చిన్న పొరపాటే ఈ ఘటనకు కారణమని డీజీసీఏ అధికారి తెలిపారు.