రైల్లో చాయ్.. రేటు పెరిగిందోయ్..

చాయ్.. గరమ్ గరమ్ చాయ్ అంటూ టీ తీసుకునేదాకా చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది బాయ్ అరుపు. కిటికీ పక్కన కూర్చుని ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ వేడి టీని తాగుతుంటే అందులో ఉండే కిక్కే వేరప్పా. మరి 7రూ.లకు దొరికే చాయ్‌ని పదిరూపాయలకు పెంచాలని ఐఆర్సీటీసి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ డిప్ టీ కాకుండా సాధారణ టీని ఐదు రూపాయలకే అందించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.

ప్రయాణీకుల నుంచి ఐఆర్సీటీసి నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చరించారు. రాజధాని, శతాబ్ది రైళ్లలో ఫుడ్ కోసం ప్రయాణీకులు ముందుగానే డబ్బు చెల్లిస్తున్నందున వాటి ధరల్లో మార్పు ఉండబోదని అధికారులు తెలియజేశారు. వీటికి సంబంధించి ప్రయాణీకుల నుంచి అధికంగా డబ్బులు తీసుకోవాలని రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ఆదేశించారు.