ఆఫీసు రూంలోకి మహిళల్ని రప్పించుకొని యజమాని చేస్తున్న పని చూస్తే..

sexually harassing girl by owner in chennai

ఉద్యోగానికి వచ్చిన యువతులను వేధిస్తున్న యజమాని బాగోతం వైరల్ గా మారింది. కాలేజ్ స్టాఫ్ ని ఆఫీసు రూంలోకి రప్పించుకొని వెంటబడి లైంగికంగా వేధిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాను చెప్పినట్టు వినకుంటే ఉద్యోగాల నుంచి తీసేస్తానని బెదిరిస్తూ…కాలేజీలో యువతులను వేధిస్తున్నాడు అతను.

తమిళనాడు కోయంబత్తూరు సమీపంలోని శరవనపట్టి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాల యజమాని నిర్వాకం ఇది. 64 ఏళ్ల సుబ్రమణి కాలేజీలో యువతులపై లైంగిక వేధించటమే పనిగా పెట్టుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో పనిచేసే ఓ యువతిని ఆఫీస్ రూంకి రప్పించుకొని వేధింపులకు పాల్పడ్డాడు. ఎలాగోలా అతని బారీ నుంచి తప్పించుకున్న ఆ యువతి..సుబ్రమణి కూతురికి ఫిర్యాదు చేసింది. ఇష్టం ఉంటే ఉద్యోగం చేయండి లేదంటే మానేయండి అంటూ బెదిరించినట్లు

చేసేది లేక యజమాని వేధింపులు భరించిన బాధితురాలు..అతని ఆగడాలు శృతి మించిపోవటంతో తన స్నేహితుల ముందు గోడు వెళ్లబోసుకుంది. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెరవెనక ఏం జరిగిందో తెలియదుగానీ, బుధవారం సాయంత్రం తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది ఆ బాధితురాలు. అయితే..సుబ్రమణి తన ఆఫీసులో వేధింపులకు పాల్పడిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.